విలేజ్ పార్క్ ధ్వంసం

by Shyam |   ( Updated:2020-09-28 06:56:52.0  )
విలేజ్ పార్క్ ధ్వంసం
X

దిశ, నర్సంపేట : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విలేజి పార్కుల ఏర్పాటుకు ఆ పార్టీ కార్యకర్తలే అడ్డంకిగా మారుతున్నారు. గ్రామస్తులు, సంబంధిత అధికారుల మూకుమ్మడి తీర్మానంతో మొదలు పెట్టిన విలేజి పార్కుకు అడుగడుగునా అడ్డంకులను సృష్టిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… ఆకుల తండా గ్రామంలోని పోచమ్మ గుడి పక్కన ఖాళీ స్థలంలో విలేజి పార్క్ ఏర్పాటు కోసం మండల ఎమ్మార్వో, ఎంపీడీవో, గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేశారు. దీనికి అనుగుణంగా గ్రామ సర్పంచ్ బానోతు రాము త్వరితగతిన పార్కు ఏర్పాట్లను సైతం చేశారు. ఇది ఇలా ఉండగా… ఈ స్థలంలో విలేజీ పార్క్ ఏర్పాటు చేయడానికి వీలు లేదనీ అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు అన్నారు. ఇది మా సంఘం భూమి అంటూ విలేజి పార్కును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ అక్కడికి వెళ్లి ఆరా తీయగా తెరాస కార్యకర్తలైన వంగ సమ్మయ్య, కూకట్ల. రవి, బోయిని. సమ్మాలు, కన్నెబొయిన. సుధాకర్, గోపు సాంబయ్య అను వ్యక్తులు దుర్భాశ లాడినట్టు సర్పంచ్ ఆరోపించారు. అధికారులు, గ్రామస్తుల సమక్షంలో చేసిన తీర్మానాన్ని ధిక్క రించడం పద్ధతి కాదని చెప్పినా వినకుండా నానా భూతులు తిట్టారని పోలీసులకు ఆయన పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed