- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారిగా ‘బాంబ్’ పేల్చిన ఈటల.. కలవరపడుతున్న టీఆర్ఎస్ నేతలు!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అటు టీఆర్ఎస్‌లో ఇటు బీజేపీలో ప్రధాన చర్చకు దారి తీశాయి. కొంతమంది నాయకులు తిరిగి తన పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారికి తన వద్ద ‘నో ఎంట్రీ’ అని కుండబద్దలు కొట్టారు. ఇంతకీ ఈటలను వీడిన వారెవరు..? తిరిగి ఆయన వద్దకు చేరేందుకు ట్రై చేస్తున్నదెవరూ..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొంతమంది నాయకులు టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ మనసు అక్కడ.. మనషులు ఇక్కడ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం కూడా గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటల కూడా ఒక్కసారిగా బాంబ్ పేల్చడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.
ఓ వైపున అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను ఒంటరిని చేయాలన్న లక్ష్యంతో ఆయన అనుచరుందరినీ కూడా తిరిగి పార్టీలోకి చేర్పించుకుంది. ఇందుకు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు ప్రత్యేక దృష్టి సారించి సక్సెస్ కాగలిగారు. అయితే, టీఆర్ఎస్ పార్టీలో చేరినా తమకు సముచిత స్థానం దక్కలేదన్న కారణంతో కొంతమంది నాయకులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలుస్తోంది. వీరంతా తిరిగి ఈటల పంచన చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈటల కూడా కొంతమంది తన వద్దకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారిని మాత్రం బీజేపీలో చేర్పించుకునేది లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రకటన టీఆర్ఎస్ వర్గాల్లో పెను చర్చకు దారి తీసిందని చెప్పాలి. ఇప్పటికే అధిష్టానం దృష్టిలో సరిగా పనిచేయడం లేదన్న అపవాదును మూటగట్టుకున్న తాము ఈటల చేసిన వ్యాఖ్యల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన కొంతమంది నాయకుల్లో నెలకొంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈటల వైపు చూస్తున్నదెవరోనన్న విషయంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఈటల బయట పెట్టారా..? లేక అధికార పార్టీ నాయకులను డైలమాలో పెట్టేందుకు వ్యాఖ్యానించారో కానీ హుజురాబాద్ లో గులాబీ పార్టీలో దడ మొదలైందనే చెప్పాలి.
సీఎం స్పందన ఏంటో..?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటన ఖరారు కావడం కూడా స్థానిక నాయకుల్లో ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మినిట్ మినిట్ అప్‌డేట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సేకరించిన రిపోర్టలను ఆధారం చేసుకుని ఎలా మందలిస్తారోనని కలవరపడుతున్నారు. పలు రకాలుగా హుజురాబాద్ పరిణామాలపై ఆరా తీయిస్తున్న ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఇంఛార్జీల తీరు వారి లోపాలను ఎత్తి చూపుతున్నారు. మొదట వరంగల్‌లో జరిగే బోయినపల్లి వినోద్ కుమార్ ఇంట జరిగే వివాహానికి హజరై తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాల్సిన ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ మారింది. గురువారం రాత్రి కరీంనగర్ చేరుకుని శుక్రవారం మధ్యాహ్నం వరకూ కరీంనగర్‌లో ముఖ్యమంత్రి ఇక్కడే ఉండనున్నారు. అయితే, హుజురాబాద్‌లో సానుకూల పరిస్థితులపై ఫ్రెష్ అప్ డేట్స్ తెప్పించుకుని ఎవరిని క్లాస్ పీకుతారోనన్న ఆందోళన నెలకొంది. హుజురాబాద్‌లో గెలవడమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ ఎందుకు అనుకూలమైన వాతావరణం రాలేదు..? అసలు లోపం ఎక్కడుంది అన్న విషయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుని కొత్త స్కెచ్ వేస్తారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.