త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు టీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి

by Sridhar Babu |   ( Updated:2021-12-09 02:10:13.0  )
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు టీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి
X

దిశ, సత్తుపల్లి : తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి (CDS) బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు11 మంది మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి సత్తుపల్లి పట్టణ, మండల టీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మరణించిన త్రివిధ దళాధిపతి బిపెన్ రావత్ దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన పదవిలో సేవలందించారని, వారి మరణం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ ప్రమాదంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, చల్లగుళ్ల కృష్ణ, రఫీ, కృష్ణ,ప్రసాద్ ,వనమా వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story