- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దల పర్యటనపై గంపెడు ఆశ.. మూతపడిన ఆఫీసుపై ఉత్కంఠ
దిశ, భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావులు శుక్రవారం చర్ల మండల పర్యటనకు వస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొంటారని టీఆర్ఎస్ చర్ల మండల అధ్యక్ష, కార్యదర్శి సోయం రాజారావు, నక్కినబోయిన శ్రీనివాస్ యాదవ్‌లు తెలిపారు. గ్రూపు గొడవలు, నాయకుల విభేదాలకు నిలయమైన చర్ల మండలంలో పార్టీ పెద్దల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా పార్టీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా దాగిఉన్న విభేదాలు సంస్థాగత ఎన్నికల సందర్భంగా రెండు గ్రూపులుగా బహిర్గతమై, భగ్గుమని రోడ్డునపడ్డాయి. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇరువర్గాలను సమన్వయం చేస్తూ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేసినా.. పట్టింపులతో నాయకుల మధ్య రగిలిన చిచ్చు చల్లారడం లేదు. పరస్పర ఫిర్యాదులతో చర్ల గొడవల పంచాయతీ స్థానిక మంత్రి వద్దకే కాకుండా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకూ వెళ్ళినట్లు సమాచారం.
పదవుల కోసం నాయకుల లొల్లి
టీఆర్ఎస్ పార్టీ చర్ల మండల కేడర్‌లో క్రమశిక్షణ లోపించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ శ్రేయస్సు కంటే నాయకుల వ్యక్తిగత ప్రతిష్టలే ఎక్కువ అయ్యాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పదవుల కోసం పార్టీని బజారుకీడుస్తున్నారన్న చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. మరీ ముఖ్యంగా పార్టీ గ్రూపుల్లో వాట్సాప్ వార్‌లను కట్టడిచేసేవారు కరువయ్యారని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమై పైనాయకులు పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా, కొందరి వైఖరి మారడంలేదని తెలుస్తోంది. టౌన్ అధ్యక్షుడిగా ముమ్మినేని సత్య సంపన్‌ను మార్చాలని మరోవర్గం మంకుపట్టు పట్టింది. ఈ పంచాయతీ తెగేవరకూ నాయకుల మధ్య సయోధ్య కుదిరేలా కనిపించడం లేదు.
మూతపడిన ఆఫీసు తెరుచుకునేనా..?
గ్రూపు గొడవల వలన పార్టీ ఆఫీసు మూతపడి దాదాపు నెలరోజులు అవుతోంది. ఆఫీసుకి స్వయంగా అధ్యక్షుడే తాళం వేయడంతో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఆఫీసు తెరవాలని కోరుతూ గ్రూపులకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు పార్టీ పెద్దలను కోరారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలతో మాట్లాడి చర్ల పార్టీని చక్కదిద్దడం కోసం ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యదర్శిలు వస్తున్నట్లుగా సమాచారం. అగ్ర నాయకుల రాకతో సమస్య పరిష్కారమై ఆఫీసు తెరుచుకుంటుందని పార్టీ గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు. చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.