- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డిపాజిట్ కోల్పోయిన నీకు.. మా ఎమ్మెల్యేని విమర్శించే హక్కు లేదు?’
దిశ,పరకాల: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి పెసరు విజయ్ చందర్ రెడ్డికి లేదని పరకాల పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీను మాట్లాడుతూ.. నియోజక వర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజలయొక్క మన్ననలను పొందుతూ, పరకాల నియోజకవర్గ ప్రజలకోసం అహర్నిశలు కృషి చేస్తున్న చల్లా ధర్మారెడ్డిని, కనీసం వార్డ్ మెంబరుగా కూడా గెలవలేని పెసరు విజయ్ చందర్ రెడ్డి విమర్శించడం అవివేకమన్నారు. విజయ్ చందర్ రెడ్డి నైతిక విలువలు మర్చిపోయి మాట్లాడడం ఇకనైనా మానుకోవాలని, లేనిచో తీవ్రమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన విజయచందర్ రెడ్డి మతి బ్రమించి, పిచ్చి ప్రేలాపనలకు దిగుతున్నారంటు, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని నీవు 40 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో , ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన చల్లా ధర్మారెడ్డిని విమర్శించడంపట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని, డిపాజిట్ కోల్పోయిన నీకు మా ఎమ్మెల్యేేని విమర్శించే హక్కు లేదని విమర్శించారు.
రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల ఉసురుతీస్తుందని నిరసన తెలపడం, ధర్నా చేయడం తప్పా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలను తెలుసుకుని, రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీ నాయకులకు మంచిది కాదని, రైతన్నల కష్టాలు బీజేపీ నాయకులకు తెలుసా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై ఒత్తిడి తీసుకువచ్చి, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యంను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి టీఆర్ఎస్ నేతలపై, ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.