మినిస్టర్ కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో భారీ ప్లాన్..!

by Shyam |   ( Updated:2021-07-21 06:52:08.0  )
ktr-and-santhosh-rao
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జూలై 24న) సందర్భంగా టీఆర్ఎస్ నేతలు భారీ ప్లాన్ వేశారు. తెలంగాణ అంతటా మూడు కోట్ల మొక్కలను ఒకే గంటలో నాటనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్ విన‌య్‌ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను బుధ‌వారం అసెంబ్లీలోని త‌న కార్యాల‌యంలో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా విన‌య్‌ భాస్కర్ మాట్లాడుతూ.. జూలై 24న కేటీఆర్ పుట్టినరోజును గ్రీన్ డేగా నిర్వహించాలని.. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని, ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.

Follow Disha daily official Facebook page : https://www.facebook.com/dishatelugunews

Advertisement

Next Story

Most Viewed