- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రచారం ముగిసింది.. కోట్లాటకు టైమైంది
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం అక్కడ కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్లు బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. జమ్మికుంట పట్టణ పరిధిలోని మేదరివాడకు చెందిన శివ అనే బీజేపీ కార్యకర్తపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయగా బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
బాధితుని కథనం మేరకు.. శివ అనే వ్యక్తి వరంగల్ నుంచి వచ్చిన బీజేపీ నేతలతో కలిసి మేదరి వాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుతో పాటు మరికొంత మంది అడ్డుకుని ప్రచారం చేయొద్దంటూ వారి సెల్‌ఫోన్లు గుంజుకొని తీవ్ర పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడినట్టు వెల్లడించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్టు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ లీడర్లు తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.