హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో ఉందా ?: వినోద్‌కుమార్

by Shyam |
హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో ఉందా ?: వినోద్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని కలిసి జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అడగాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడటం సరి కాదని, జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని ప్రధాని మోడీని బీజేపీ నాయకులు కోరాలని పేర్కొన్నారు. బీజేపీ, మజ్లిస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం, మహనీయులు పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలను కూల్చుతామని మజ్లిస్ ​నాయకులు అనడం బాధాకరమన్నారు. హైదరాబాద్ ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story