- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో టీఆర్ఎస్ నేత మృతి.. ఎమ్మెల్యే సంతాపం
దిశ, చిట్యాల : కరోనాతో టీఆర్ఎస్ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రవీందర్ రెడ్డి మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన కుంభం రవీందర్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ ముందు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం రవీందర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో కొన్నాళ్లు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాడు. అయితే.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో ఊపిరితిత్తులలో తీవ్రంగా ఇన్ఫెక్షన్ కావడంతో సోమవారం ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత 20 సంవత్సరాలుగా రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటు పార్టీ శ్రేణులు, అటు ప్రజల గుండెల్లో అలుపెరగని నాయకుడిగా తనదైన ముద్రను వేసుకున్నారు. రవీందర్ మృతి పట్ల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీటీసి గొర్రెసాగర్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.