రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి టీఆర్ఎస్ కీలక నేత

by Aamani |   ( Updated:2021-12-19 09:45:40.0  )
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి టీఆర్ఎస్ కీలక నేత
X

దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కీలక నేత ముచ్చర్ల మల్లయ్య ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లయ్యకు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతేగాకుండా.. మాజీ మంత్రి, సీనియర్ నేత గడ్డం వినోద్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, కాసిపేట భీమిని తదితర మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని గాంధీభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బెల్లంపల్లి జెడ్పీటీసీ రాంచందర్, పార్టీ నాయకులు ఎండీ ఈసా, కామని శ్రీనివాస్ , జుబేర్, శ్యామ్, రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story