- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌కు షాక్.. కీలక నేతలు రాజీనామా
దిశ, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ చైర్మన్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావుతో సహా, తుమ్మల చెల్క ఎంపీటీసీ, సులానగర్, రోళ్ళపాడుకు చెందిన సొసైటీ డైరెక్టర్లు సోమవారం వారి పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. అంతేగాకుండా, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆమె భర్త హరిసింగ్ నాయక్, షాడో ఎమ్మెల్యే అనుచరులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కావాలనే పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండాపోయిందని తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో చందాలు, దందాలు, మద్యం మాఫియా, భూ కుంభకోణాలు, ఇసుక మాఫియా చేసి షాడోకి మూటలు అప్పజెప్పేవారికి పెద్దపీట వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కష్టపడి పార్టీకోసం పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత లేకపోవడం, పార్టీలో పర్యవేక్షణ లోపం కారణంగా తాము పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఏదిఏమైనా మిగిలినవారు కూడా ఇదే బాటపట్టకముందే జిల్లా మంత్రి నియోజకవర్గంపై దృష్టిసారించాలని కోరుతున్నారు.