పేదల భూములను లాక్కుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

by Shyam |
Bakkani Narsimhalu
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు వేదికల పేరుతో పేదల భూములను లాక్కుంటోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో తెలుగురైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అంటే యజ్ఞం వంటిదని, అది లాభసాటికోసం చేసేదికాదన్నారు. ఉన్నకాస్త భూమిలో పేదలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారి భూమిని ప్రభుత్వం రైతు వేదికల పేరుతో లాక్కోవడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలిమినేటి మాధవరెడ్డి లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు, నీరు-మీరు, వాటర్ షెడ్ నిర్మాణం, రైతు బజార్ల ఏర్పాటు, సబ్సిడీ విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. తెలుగు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్, అధికార ప్రతినిధి జ్యోత్స్న, అజ్మీరా రాజునాయక్, గన్నోజు శ్రీనివాసాచారి, షేక్ ఆరీఫ్, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కుందారపు కృష్ణాచారి, కూరపాటి వెంకటేశ్వర్లు, గూడెపు సుభాష్ యాదవ్, రామచందర్ రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed