- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ కార్పొరేటర్ ‘విశ్రాంతమ్మ’ ఇకలేరు..
దిశ, జవహర్ నగర్ : క్యాన్సర్ బారినపడి అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కన్నుమూశారు. 16వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్‌గా ఎన్నికైన విశ్రాంతమ్మ(55) గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విశ్రాంతమ్మ పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇండిపెండెంట్ కార్పొరేటర్‌గా గెలుపొందిన విశ్రాంతమ్మ డివిజన్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. విశ్రాంతమ్మ భర్త పేరు రాబర్ట్. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు కలరు.
వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కంభం మండలం, మల్లాపూర్ గ్రామం నుంచి గత 35 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం నగరంలోని జవహర్ నగర్‌లో స్థిరపడ్డారు. నిరుపేదలకు గూడు కల్పించేందుకు కృషి చేయడమే కాకుండా, ఎన్నో సామాజిక కార్యకలాపాల నిర్వహణ, అరుంధతి నగర్ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. 2002లో కారింగుల శంకర్ గౌడ్ సర్పంచ్‌గా ఉన్న టైంలో ఈమె వార్డు సభ్యురాలి గా ఎన్నికయ్యారు. విశ్రాంతమ్మ మరణంపై మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు, కో- ఆప్షన్ నెంబర్‌లు, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.