- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీర్‌పేట్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ రౌడీ బంధువులు హల్‌చల్
దిశ, జల్‌పల్లి : రాత్రి వేళల్లో బైకుమరమ్మత్తు పనులు చేయాలంటూ అధికార పార్టీ కార్పొరేటర్ బంధువులు మెకానిక్ షాపులో నానా బీభత్సం సృష్టించారు. అన్నలేడు ఉదయం రమ్మని చెప్పినా మెకానిక్‌పై దౌర్జాన్యానికి దిగడమే కాకుండా దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి కొడుకులు మెకానిక్‌ను చితకబాదారు. అడ్డు వచ్చిన కూరగాయల వ్యాపారిపై కూడా దాడికి తెగబ్డడారు. పోలీసుల అక్కడకు చేరుకోగా వారి కళ్ళెదుటే మరోసారి పైశాచిక దాడికి పాల్పడిన ఘటన మీర్‌పేట్ పోలీస్స్టేషన్పరిధితో తీవ్ర కలకలం రేపుతుంది. ఘటనా స్థలిలో ఉన్న సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాధితుని కథనం ప్రకారం. లెనిన్‌నగర్,భాగ్య కళానగర్ రైతుబజార్వద్ద అదే ప్రాంతానికి చెందిన విష్ణు, మహేష్(20)లు శ్రీసాయిరాం బైక్ పాయింట్‌ను నడిపిస్తున్నాడు.
బుధవారం రాత్రి విష్ణు వేరే పని నిమిత్తం బయటికి వెళ్ళడంతో అతని సోదరుడు మహేష్ బైక్స్ మరమ్మతు పనులు చేస్తున్నాడు. రాత్రి 8.30 గంటలకు అదే ప్రాంతానికి చెందిన స్థానిక టీఆర్ఎస్కార్పొరేటర్బంధువులు రాము నాయక్ అతని కుమారుడు రాజేష్, మరో కొడుకు కలిసి శ్రీసాయిరాం బైక్పాయింట్కు చేరుకున్నారు. తమ బైకు పంక్చరైతే చేయించామని, వెనుక టైర్ పట్టుకుందని వెంటనే రిపేర్చేయాలని రామునాయక్మహేష్ను అడిగాడు. అయితే, అన్న లేడని, ఇప్పటికే ఆలస్యమైంది. రేపు ఉదయం వస్తే అన్న ఉంటాడు చేస్తాడని మహేష్ అనగా.. అతన్ని దుర్భాషలాడుతూ తండ్రి కొడుకులు ముగ్గురు మెకానిక్ పై దాడికి తెగబడ్డారు. ఎదురుగా ఉన్న కూరగాయల వ్యాపారి జయన్న అక్కడకు వచ్చి ఎందుకు కొడుతున్నారని అడిగిన పాపానికి అతన్ని కూడా చితకబాదారు. సమాచారం అందుకున్న మీర్పేట్పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో గొడవ జరిగిన తీరును వివరిస్తున్న మహేష్‌ను పోలీసుల ఎదుటే మరోసారి దాడికి దిగారు. దీంతో మహేష్‌తో పాటు కూరగాయాల వ్యాపారి జయన్న బుధవారం అర్థరాత్రి మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవ టైంలో తన దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు తులం విలువ గల బంగారు చైన్కూడా లాక్కున్నారని జయన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.