మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం.. ఆమె ముందే కార్యకర్తల వీరంగం

by Shyam |
fight
X

దిశ, ఎల్బీనగర్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోమవారం సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని యుజిడి పనులను ప్రారంభించడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు అనుకూలంగా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీ నినాదాలు చేయడం ఏంటని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు.

వెంటనే బీజేపీ నాయకులు జై నరేంద్ర మోడీ, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒక బీజేపీ కార్యకర్త గాయాల పాలయ్యారు. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Next Story

Most Viewed