‘మా అభివృద్ధి పనులు మీరు చూడొద్దు’

by Shyam |   ( Updated:2020-10-03 03:26:26.0  )
‘మా అభివృద్ధి పనులు మీరు చూడొద్దు’
X

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: జిల్లాలో కేంద్రంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దివిటీపల్లి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాళ్లో వెళితే… దివిటిపల్లి గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్ఫీ వెంకటేష్ ఆధ్వర్యంలో కూడిన కాంగ్రెస్ బృందం శనివారం పరిశీలనకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకుని, తాము చేపట్టిన అభివృద్ది పనులు చూసేందుకు రావద్దంటూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Next Story