మాటే మంత్రం.. అదే ఆయన తంత్రం

by Shyam |   ( Updated:2020-04-22 06:51:49.0  )
మాటే మంత్రం.. అదే ఆయన తంత్రం
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… నిజమే తన మాటలతో ప్రేక్షకులపై మంత్రం వేయగలడు. ఆ మాట ద్వారా లక్షల మందిని ప్రభావితం చేయగలడు. ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్పగలడు. సినిమాలు మనిషి మీద ప్రభావం చూపుతాయి అంటే ఇది నిజమా కాదా? అని ప్రశ్న తలెత్తినప్పుడు… ఒక్కసారి త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొచ్చింది అనుకో.. నిజం.. నిజంగా సినిమాలు మనిషిని ప్రభావితం చేయగలవు అనే అనిపిస్తుంది. త్రివిక్రమ్ మాటల్లో పదును ఉంటుంది… తను చెప్పాలి అనుకున్నది స్పష్టంగా చెప్తాడు. తన అనుభవాన్ని రంగరించి రాస్తాడో… ఇతరుల అనుభవసారాన్ని తెలుసుకుని మరి రాస్తారో తెలియదు కానీ… జీవితాన్ని చదివేసిన వ్యక్తిలా ఉంటాయి ఆయన మాటలు. ప్రేమగా, బాధగా, కోపంగా, హాస్యంగా ఎలా చెప్పినా సరే…. ఆయన మాటలో ఓ నిజం దాగి ఉంటుంది. ఆ డైలాగ్ లో ఎనలేని అనుభవం ఉన్నట్లు కనిపిస్తుంది… ఆ అనుభవంతో చెప్పిన మాట సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చేస్తుంది. మనిషి మెదడుకు పని చెప్పేలా చేస్తుంది. భారీ భారీ డైలాగ్ లు కాదు… ఒక్క చిన్న మాటతో గుండెలను పిండేసే రైటింగ్ స్కిల్స్ ఆయన సొంతం.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్… తొలి సినిమా స్వయంవరం ఏప్రిల్ 22, 1999న రిలీజ్ అయింది. ఈ సినిమాకు మాటల రచయితగా పనిచేశాడు. పంచ్ డైలాగ్స్ తో సినిమాకు ప్లస్ అయ్యాడు. ఆ తర్వాత నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి సినిమాలకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్… నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో తరుణ్ రిషి క్యారెక్టర్ ను త్రివిక్రమ్ మలిచిన తీరు… తండ్రీ కూతురు మధ్య అనుబంధం, తండ్రీకొడుకుల మధ్య కామెడీ సన్నివేశాలు… హీరోయిన్ కోసం హీరో తపన పడే తీరు… అద్భుతంగా మలిచారు. చెప్పాలంటే తరుణ్ కు ఇది బెస్ట్ మూవీ. రిషి అనే క్యారెక్టర్ తరుణ్ కోసమే క్రియేట్ అయింది అనిపిస్తుంది. అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్.

తర్వాత వచ్చిన అతడు సినిమా… త్రివిక్రమ్ ను దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించింది. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, కథ అదిరిపోగా మహేష్ బాబు హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్.

అతడు డైలాగ్స్ :

1. నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబడ్డమాడే హక్కు లేదు.. నిజం చెప్పకపోవడం అబద్దం… అబద్ధాన్ని నిజం చేయాలి అనుకోవడం మోసం ..
2. నువ్వు అడిగావు కాబట్టి చెప్పట్లేదు.. నమ్మాను కాబట్టి చెప్తున్నా.. హనుమంతుడు కన్నా రాముడికి నమ్మకస్తుడు ఎవరుంటారు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా జల్సా… ఈ సినిమా త్రివిక్రమ్ ను స్టార్ డైరెక్టర్ ను చేసింది.

జల్సా డైలాగ్స్ :

1. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు..శత్రువుని ఓడించడం.. శత్రువును ఒడించడమే యుద్ధం యొక్క లక్ష్యం
2. ఒక మనిషిలో కోపం ఉంటే అది శక్తి.. అదే ఒక గుంపులో ఉంటే ఉద్యమం

జల్సా తర్వాత మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఖలేజా సినిమా చేసిన త్రివిక్రమ్… మహేష్ లో కామెడీ యాంగిల్ ను సరికొత్తగా చూపించాడు. ఫ్రేమ్ ఫ్రేమ్ కు పంచ్ డైలాగ్ లతో,హీరో మహేష్ తో కామెడీ చేయించి బెస్ట్ అనిపించుకున్నారు. కామెడీ యాడ్ చేస్తూనే దేవుడు అంటే ఎక్కడో ఉండడు.. నీలోను నాలోనూ ఇక్కడే ఉంటాడు.. అవతలి వాడు సాయం కోసం అడిగినప్పుడు బయటకి వస్తాడు.. అంటూ… దేవుడికి సరికొత్త డెఫినేషన్ ఇచ్చాడు త్రివిక్రమ్.

ఖలేజా డైలాగ్స్ :

1.అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు… జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు

సామీ.. నువ్వే మా దేవుడివి ఇది నువ్వు నమ్మే పని లేదు… మాకు నమ్మించే అక్కర లేదు…

సామీ.. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

ఇక అల్లు అర్జున్ తో జులాయి చేసిన త్రివిక్రమ్… లాజిక్ ల కన్నా మ్యాజిక్ లనే జనాలు నమ్ముతారని మెసేజ్ ఇచ్చాడు. అందుకే మన దేశం లో సైంటిస్ట్ ల కంటే బాబాలే ఫేమస్ అంటూ సమాజాంలోని తప్పును సుతిమెత్తగా ఎత్తి చూపారు. మరీ అత్యాశకు పోయి లేని పోని తలనొప్పులు తెచ్చుకోవద్దని మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాతో.

జులాయి డైలాగ్స్

1. లక్ష రూపాయల లాటరీ టికెట్ ను కూడా కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయితో నే కొనాలి
2. ఆశ ఉంటే క్యాన్సర్ అయినా జయించొచ్చు… భయం ఉంటే అల్సర్ తో కూడా పోవచ్చు

మళ్లీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ చేసిన మూవీ అత్తారింటికి దారేది. తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. మేనల్లుడు తాతకు ఇచ్చిన మాటకోసం అత్తను తీసుకువెళ్లేందుకు … ఓ ధనవంతుడు డ్రైవర్ గా మారడం… అత్తను మార్చి ఇంటికి తీసుకువెళ్లడం కథ. కాగా సినిమాతో ఓ లెవెల్ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్.

అత్తారింటికి దారేది డైలాగ్స్ :

1. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పొడు
2. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..
3. పాము పరధ్యానంలో ఉందని పడగ మీద కాలేయకూడదు రో..

సన్నాఫ్ సత్యమూర్తి… ఎవరు మనవాల్లో ఎవరూ పరయివాల్లో గుర్తించాలని చెప్పే సినిమా. అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా… కొడుకు తన తండ్రి ఎప్పుడూ హీరోగానే ఉండాలి అనుకుంటాడు… 100 మందిలో 99 మంది కాదు ఉన్న 100 మంది కూడా తన తండ్రి గొప్పోడు అనాలి అని కోరుకునే వ్యక్తి.

సన్నాఫ్ సత్యమూర్తి డైలాగ్స్ :

1. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి… కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్.
2. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత .. పిల్లలు మోయాలి అనుకునే బరువు… కానీ నా దృష్టిలో నాన్న అంటే మరిచిపోలేని ఒక జ్ఞాపకం

అరవింద సమేత సినిమా… తారక్ హీరోగా వచ్చిన సినిమా ద్వారా తన పెన్ పవర్ ను చూపించాడు. కత్తి కన్నా కాంప్రమైజ్ గొప్పదని… యుద్ధం కన్నా సంధి గొప్పదని చాటి చెప్పాడు త్రివిక్రమ్.

అరవింద సమేత డైలాగ్స్

1. వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు… అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు
2. కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి..
3. వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు..?. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈ ఒక్క అడుగు వందడుగులతో సమానం సార్ … తవ్వి చూడండి …
4. వినే టైమ్.. చెప్పే మనిషివల్ల విషయం విలువే మారిపోతుంది

అల వైకుంఠ పురంలో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసిన త్రివిక్రమ్… బ్లాక్ బస్టర్ హిట్ కలెక్షన్లు అందుకున్నాడు. ఒక తండ్రి స్వార్థం వల్ల మరొకరి కొడుకు పడే బాధ, వేదన…. తన తండ్రిని సమస్యల నుంచి కాపాడుకునే తపనను చాలా కమర్షియల్ గా, చాలా రిచ్ గా చూపించాడు త్రివిక్రమ్. ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మనాన్న అనుకోడమేనా.. అమ్మ నాన్న బాగుండాలని పిల్లలు అనుకుంటారు? కదా అనే మెసేజ్ తో సినిమా చేసి మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురిపించాడు. నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేశాడు.

అల వైకుంఠ పురంలో డైలాగ్స్ :

1. మనిషిని ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే కానీ… నిజం చెప్తేనే కదా ప్రేమ ఎంత గట్టిదో తెలిసేది అనే మెసేజ్
2. గొప్ప యుద్దాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే
3. దేవుడికి కూడా దక్షిణ కావాలి .. రాజుకు కూడా రక్షణ కావాలి.
4. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది సార్…ఒకటి నేలకి రెండు ఆడవాళ్లకి.. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్.. జస్ట్ సరెండర్ అయిపోవాలి అంతే…

Tags: Trivikram Srinivas, Director, Tollywood, 21years

Advertisement

Next Story