సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన ‘త్రిష’

by Shyam |   ( Updated:2020-06-15 00:35:32.0  )
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన ‘త్రిష’
X

స్టార్ హీరోయిన్ త్రిష లాక్‌డౌన్ టైమ్‌లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పట్ల అభిమానులకు అవగాహన కల్పించడంతో పాటు టిక్‌టాక్ వీడియోలతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. ఈ పీరియడ్‌లోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబుతో కలిసి షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది ఈ సీనియర్ హీరోయిన్. కానీ ఇప్పుడు వీటన్నింటి నుంచి బ్రేక్ కావాలని కోరుకుంటోందట. అందుకే సోషల్ మీడియా నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పింది.

‘నేను సంతోషంగానే ఉన్నా.. నా మనసుకు ఈ సమయంలో ఉపేక్ష అవసరం’ అని చెప్పింది. మైండ్‌కు ఇది డిజిటల్ డిటాక్స్ అని తెలిపిన త్రిష.. ‘ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. ఈ ఆపద కూడా దాటుతుంది. లవ్ యూ ఆల్.. త్వరలో మీ అందరినీ కలుస్తా’ అని తెలిపింది. దీంతో కొంత నిరాశ చెందిన ఫ్యాన్స్.. తమ ఫేవరెట్ స్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసే సమయం త్వరగా రావాలని కోరుకుంటున్నారు.

ఇక చివరగా ‘పేట’ సినిమాలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియిన్ సెల్వన్‌తో పాటు మరో ఆరు సినిమాలు చేస్తోంది.

Advertisement

Next Story