- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బతుకులు ఆగం చేయొద్దు.. ఆదివాసీల గోడు
by Sridhar Babu |
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: అటవీశాఖ భూముల్లో ట్రెంచ్ కొడుతుండగా పోడు రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా తాము పోడు చేసుకుంటూ బతుకుతున్న మా భూముల్లో కందకాలు తీయొద్దని అధికారులను వేడుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామంలోని గురువారం అటవీ భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు అటవీ అధికారులు ఎక్స్‌కవేటర్‌తో వెళ్లారు. ఎక్స్‌కవేటర్‌తో ట్రెంచ్ కొడుతుండగా ఆదివాసీలు అక్కడికి చేరుకుని పనులను అడ్డగించారు. వాహనాలకు అడ్డంగా పడుకుని పనుల నిర్వహణను అడ్డుకున్నారు. ‘తమ ప్రాణాలైనా ఇస్తాం గాని, మా బతుకును ఆగం చేసే ఈ పనులకు మేము ఒప్పుకోం’ అంటూ తెగేసి చెప్పారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Advertisement
Next Story