- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా భూముల్లో మీకేం పని..
దిశ,మునుగోడు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని తుంబావి తండాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తుంబావి తండా 273 సర్వే నెంబర్‌లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నిచంగా స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. మా పట్టా భూముల్లో చెట్లు ఎలా నాటుతారంటూ అటవీ అధికారులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఫారెస్ట్ రేంజ్ అధికారి సర్వేశ్వర్ ఘటనా స్థలికి చేరుకొని గిరిజన రైతులతో మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులుఈ భూమి గిరిజనులది అని ధ్రువీకరిస్తే మేము ఎలాంటి పనులు చేపట్టమని తెలిపారు. దీంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తామని గిరిజనులను సముదాయించారు. అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల క్రితమే రెవిన్యూ శాఖ తమకు ఇండ్ల పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి ఈ భూములు తమవీ అంటే.. మరి మా భూములు ఎక్కడ ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక అటవీ అధికారులు వెనుదిరిగారు. ఆ సమయంలో గిరిజన రైతులకు మద్దతుగా వైస్సార్సీపీ నాయకులు రహీం షరీఫ్, మాదగోని జంగయ్య, బైకని నరేందర్ నిలిచారు.