ఉలిక్కిపడ్డ మన్యం.. అడవి బిడ్డకు కరోనా!

by Aamani |   ( Updated:2020-04-22 11:14:17.0  )

దిశ, ఆదిలాబాద్: బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో జీవనం సాగిస్తున్న ఓ మహిళకు కరోనా సోకింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం పంగిడి గ్రామానికి చెందిన మహిళకు పరీక్షలు నిర్వహించగా వైరస్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.సెకండ్ కాంటాక్ట్ ద్వారా ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జైనూరు మండల కేంద్రంలో మర్కజ్ వెళ్లి వచ్చిన పోస్టల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. అతనితోపాటే కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్ట్స్ వారిని గుర్తించి నిర్బంధంలో ఉంచారు. సుమారు 70 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.

ఉలిక్కిపడ్డ మన్యం..

కరోనా వైరస్ ఇప్పటివరకు ఆదిలాబాద్ ఏజెన్సీపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఆదివాసులు ఎక్కువగా ఉండే ఉట్నూరు ఏజెన్సీలో కరోనా సమాచారం అందగానే వారంతా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఏజెన్సీ పరిధిలోని జైనూరు, హస్నాపూర్ గ్రామాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా మర్కజ్ వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆదివాసులు బయటకు రాకుండా గ్రామాలకే పరిమితమై ప్రభుత్వ ఆంక్షలను పాటించారు. గతంలో మలేరియా, డయేరియా, అతిసారం, కలరా వంటి అనేక అంటు వ్యాధులు చవిచూసిన ఆదివాసులు కరోనా విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడ్డారు. కానీ, ఆదివాసీల్లో ఒకరికి కరోనా సోకింది.

Tags: tribal got corona, women, komaram bheem dist, 70 meme quarantine, markaz, second contact

Advertisement

Next Story

Most Viewed