- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి ఇక లేరు
దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది భీమా కోరేగావ్ ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్టయిన ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మరణించారని ఆయన తరఫు న్యాయవాది సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపారు. అనారోగ్యం కారణంగా 84 ఏళ్ల స్వామి ఆదివారం నుంచి వెంటిలేటర్‌పై ఉన్నారు. జైలులో ఉన్న ఆయనకు తగిన చికిత్స అందించాలని మే 28న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు స్టాన్ స్వామిని ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఉపా చట్టాన్ని సవాల్ చేస్తూ గతవారం స్టాన్ స్వామి హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రాణాలను కాపాడాలని మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు కోరుతూ వచ్చారు. ఎల్గార్ కేసులో స్టాన్ స్వామితో సహా నిందితులుగా ఉన్నవారు కూడా నవీ ముంబైలోని తలోజా జైలులో ఆరోగ్య సదుపాయాలు లేవని పదేపదే ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్వామిని ఆస్ఫత్రిలో చేర్పించినా.. ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు.
- Tags
- Died