- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబిడ్స్‌లో గిరిజన మ్యూజియం ఏర్పాటు.. మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అబిడ్స్లోగిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అతి త్వరలో శంకుస్థాన చేస్తామన్నారు. గిరిజన మ్యూజియంలో గిరిజన యోధులు కొమురం భీమ్, రాంజీ గోండులపై నిర్మించిన డాక్యుమెంటరీలను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన బిర్సాముండా, కొమురం భీమ్, రాంజీగోండుల అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి కేసిఆర్ నడుస్తున్నారన్నారు.
గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పట్టభూముల సమస్యలను పరిష్కరించి త్వరలో పట్టాలు వచ్చేలా చేస్తామన్నారు. గిరిజనుల చదువుకు కూడా ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, అధికారులు సత్యనారాయణ, సముజ్వల, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.