- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: ‘రీల్స్’ ముందు ప్రాణం విలువ ఎంత? ఎత్తైన భవనంపై నుంచి వేలాడుతున్న యువతి
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంత మంది యువత పిచ్చి పిచ్చి చేష్టాలతో రీల్స్ చేస్తున్నారు. కొందరు పబ్లిక్‌గా వికృత చేష్టలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తూంటే.. మరి కొందరు డేంజర్ స్టంట్స్ వేస్తూ వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇక నడుస్తున్న రైళ్లు, రోడ్డుపై డేంజర్ బైక్ స్టంట్స్, సముద్రాలు, నదులు, క్రూర మృగాల వద్ద.. అనేక రకాలుగా రీల్స్ చేసి.. రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని భావించి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మీరు చూసే ఉంటారు. ఇటీవలే రీల్స్ పిచ్చిలో ఓ యువతి కారును మెల్లగా వెనక్కి నడుపుతూ వెళ్లి సమీపంలో ఉన్న లోయలో కారుతో సహా పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా మరో ఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
పూణే - జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఒక అమ్మాయి, అబ్బాయి ప్రాణాలను ప్రమాదంలో నెట్టి స్టంట్స్ చేశారు. హైట్ ఉన్న భవనంపై ‘దేశముదురు’ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఓ ఫైట్ సీన్‌లో బ్రీడ్జిని ఒక చేయితో పట్టుకుని వేలాడుతూ డైలాగ్ చెబుతాడు. ఇక్కడ అమ్మాయి.. హైట్ బిల్డింగ్ పై అబ్బాయి చేయి పట్టుకొని కిందకి వేలాడుతూ అలాగే ప్రవర్తిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వారిపై పూణే పోలీసులకు ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు లెక్క చేయకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకునేందుకు ఈ ఫీట్స్ చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఈ రీల్స్ పిచ్చి తగ్గుతుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.