తెలుగుకు పట్టించకు తెగులు! తెలుగు వచ్చిన వాళ్ళు మెల్లగ వెళ్లొద్దంటా?

by Ramesh N |   ( Updated:2024-04-09 14:38:58.0  )
తెలుగుకు పట్టించకు తెగులు! తెలుగు వచ్చిన వాళ్ళు మెల్లగ వెళ్లొద్దంటా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆఫీసులు, షాపింగ్ మాల్స్ సంబంధిత బోర్డులపై ఇంగ్లిష్ తప్ప తెలుగు పదాలు కనిపించడం లేదని ఇప్పటికే తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఓ సైన్ బోర్డుపై తెలుగు పదాలు తప్పుగా రాసి భాషాభిమానులకు కోపం తెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ పక్కన రోడ్డుపై సైన్ బోర్డులు పెట్టారు. బోర్డు పై జాగ్రత్త హిందీలో దీరే చలీయే అని రాసి ఉంది. అయితే తెలుగులో ‘నెమ్మదిగా వెళ్ళుము’ బదులుగా ‘నెమ్మదిగా వెళ్ళము’ అని రాసి ఉంది.

"హిందీ వచ్చిన వాళ్ళు మెల్లగ వెళ్ళాలి, "తెలుగు వచ్చిన వాళ్ళు మెల్లగ వెళ్లొద్దు!" అని సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ సెటైర్లు వేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ‘అక్షరం తప్పుగా రాసినా అర్థమే మారిపోతుంది. హిందీలో సరిగ్గా రాసి, తెలుగుకు మాత్రం తెగులు పట్టించారు. తెలుగును మరిచిపోయేంతగా హిందీ మాయలో పడ్డారు’ అని మరో నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుకు పట్టించకు తెగులు అనే హ్యష్ ట్యాగ్‌తో కామెంట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed