- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: వామ్మో.. ఇంతమంది ఉన్నారేంట్రా.. ఫ్లైట్ నిండిపోయిందిగా..

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా జుట్టు రాలిపోవటం (Hair loss) అనేది సర్వ సాధారణమైన అంశంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మగవారికి అయితే 30 ఏళ్లకే బట్టతల (Bald) వచ్చేస్తోంది. ఇలాంటి వారికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ (Hair Transplantation) పెద్ద వరంలాంటిదనే చెప్పాలి. అంటే.. నెత్తి మీత జుట్టును పర్మినెంట్‌గా మెలిపిస్తారన్నమాట. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పద్ధతిలో తమ బట్టతలను పొగొట్టుకుంటున్నారు. ఇక ఈ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో టర్కీ (Turkey) వరల్డ్ లీడర్‌గా మారింది. దీంతో ప్రపంచంలోని జుట్టు ఊడి గుండు అయిన వాళ్లు, జుట్టు ఊడిపోతున్న వాళ్లు.. ఆ దేశానికి క్యూ కడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral in Social media) మారింది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు టర్కీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పైగా ఇక్కడ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఖర్చు కూడా చాలా తక్కువ. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ సహా ఇతర ఏ దేశంలో అయినా కనీసం పన్నెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే టర్కీలో అయితే మొత్తంగా నాలుగువేల డాలర్లతో పని పూర్తయిపోతుంది. దీంతో ఇటీవలి కాలంలో టర్కీకి హెయిర్ ట్రాన్స్ ప్రాలంటేషన్ కోసం వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పదులు, వందలు కాదు.. వేలల్లో టర్కీకి తరలివెళ్తున్నారు. ఇక నెట్టింట తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. ఏంటి ఇంత మందా అని ఆశ్చర్యపోతారు. ఏకంగా ఓ ఫ్లైట్ నిండా బట్టతలలతో ఉన్నా మగవారే ఉన్నారు. దీంతో టర్కిష్ ఎయిర్ లైన్స్ కాదు.. టర్కిష్ హెయిర్ లైన్స్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. కేవలం విమానంలో మాత్రమే కాదు.. టర్కీ వీధుల్లో సైతం ఎక్కువగా వాళ్లే కనిపిస్తున్నారు.
తుర్కియో అనే దేశం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి ఫేమస్ అంట
— PasupuDandu (@BaluTweets0408) March 7, 2025
సో అక్కడ విమానాశ్రయంలో దానికోసం వచ్చినోళ్లే కనిపిస్తారంట pic.twitter.com/KMWCaK8ndJ