Devotees drink AC Water : దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు

by Ramesh N |   ( Updated:2024-11-04 12:41:14.0  )
Devotees drink AC Water : దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: Devotees drink AC Water : గుడికి వెళ్తే దేవుని ప్రసాదం, తీర్థం తీసుకోవడం దేవాలయాల్లో తరుచూ చూస్తూనే ఉంటాము. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రజలకు దైవభక్తి శృతి మించిపోయిందని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. UP ఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ Banke Bihari Mandir ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని పవిత్ర జలం అనుకోని టీ కప్పుల్లో నింపుకొని భక్తులు ఎగబడి మరి తాగుతున్నారు. కొంత మంది నెత్తిమీద జల్లు కుంటున్నారు.

ఈ వ్యవహారం అంత ఓ వ్యక్తి వీడియో తీస్తూ.. ఇది కృష్ణుని చరణామృతం నీళ్లు కాదని, ఏసీ నీళ్లు అని అక్కడికి వచ్చే భక్తులకు సూచిస్తున్నాడు. అయిన కూడా కొంతమంది భక్తులు నీళ్లు తాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అది పవిత్ర జలం కాదని, చదువుకున్న వారు సైతం తీర్థమా? ఏసీ నీళ్ళ చూసుకోకుండా తాగడం సిగ్గు చేటని విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఏసీ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, అందులో ఫంగస్ ఉంటుందని, దీంతో ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed