- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: నువ్వు దేవుడివి సామి! భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసిన భర్త.. ఎక్కడున్నా బాగుండాలంటూ
దిశ, ఫీచర్స్: భార్య ఇంకో వ్యక్తిని ఇష్టపడుతున్నదని తెలిసిన భర్త.. ఆమె ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాడు. ఈ ఘటన బీహార్‌లోని లఖిసరాయ్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..
రాజేష్ కుమార్ (26) బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లా రామ్‌నగర్ గ్రామానికి చెందినవాడు. ఇతని భార్య ఖుష్బూ కుమారి (22). వీరికి 2021లో వివాహం కాగా రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.ఇక ఖుష్బూ కుమారి అదే గ్రామానికి చెందిన చందన్ కుమార్ (24)తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. అయితే అంతకుముందే ఖుష్బూ తల్లిదండ్రులు తమ కుమార్తెకు రాజేష్ కుమార్‌తో వివాహం జరిపించారు. కానీ ఖుష్బూ కుమారి తన పాత ప్రేమను మర్చిపోలేక బాధపడుతూ వచ్చింది. అలా ఒక రాత్రి రాజేష్ లేని సమయంలో, చందన్ కుమార్ ఖుష్బూ ఇంటికి వచ్చాడు. అప్పుడు రాజేష్ కుమార్ సోదరులు ఖుష్బూ, చందన్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం, మరుసటి రోజు ఉదయం ఖుష్బూ, చందన్ కుమార్‌లను పంచాయితీకి తీసుకువచ్చారు. ఈ పంచాయతీలో భాగంగా అక్కడికి వచ్చిన ఆమె భర్త రాజేష్ కుమార్.. తన భార్యను ప్రేమించిన చందన్‌తో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అనంతరం ఇరువురి అంగీకారంతో అక్కడి ఆలయంలో వివాహం జరిగింది. దీంతో రాజేష్ తన రెండేళ్ల బాలుడిని తన వద్దే ఉంచుకుని భార్యను ప్రియుడితో సంతోషంగా పంపించాడు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. ''వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలి. వారు ఎక్కడున్నా బాగుండాలి. నేను నా కొడుకుతో కలిసి జీవిస్తాను."అంటూ తెలిపాడు.
అలాగే ఖుష్బూ కుమారి మాట్లాడుతూ.. "నా భర్త నన్ను ప్రేమికుడితో చూడగానే పెళ్లికి అంగీకరించాడు. ఆయనకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు, నేను నా కొత్త భర్తతో సంతోషంగా జీవిస్తాను." అంటూ వెల్లడించింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వగా నువ్వు దేవుడివి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు.