- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Viral Video: ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఏమో అనుకున్నాం.. అది ఇదే కదా!..
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఈ జనరేషన్ మనుషుల కంటే ఎక్కువగా జంతువులకే ప్రయారిటీ ఇస్తుంది. అందులోనూ ముఖ్యంగా కుక్కలకు ఇచ్చే వాల్యూ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు కుక్కలు వీధుల్లో ఉండేవి. మనం వాటికి ఓ ముద్ద పడేస్తే విశ్వాసంగా మనకు మన ఇంటికి కాపలా కాస్తుండేది. కానీ తరాలు మారుతున్నప్పటి నుంచి వీధిలో ఉండే కుక్క ఇంట్లో అది కూడా మన పక్కలో ఉంటుంది. మనుషులకి వలే వాటికి సపరేట్ బెడ్, ఫుడ్ వంటివి అరేంజ్ చేస్తున్నారు డాగ్ లవర్స్. ప్రతినెలా వేల రూపాయలు వెచ్చించి వాటిని అపురూపంగా పెంచేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తన కుక్కకు అలాంటి బహుమతి ఇవ్వడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ముంబయిలోని చెంబూర్ ప్రాంతంలో ఉన్న అనిల్ జ్యువెలర్స్ అనే నగల దుకాణం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మహిళ, ఆమె కుక్కతో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. సరిత అనే మహిళ తన కుక్కతో కలిసి నగల దుకాణానికి వచ్చి అక్కడ మందపాటి బంగారు గొలుసును కొని తన కుక్కను ధరించేలా చేసింది. కుక్కకి బర్త్ డే గిఫ్ట్‌గా ఆ చైన్‌ను కొనింది. మహిళ తన ప్రియమైన డాగీ టైగర్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వీడియో వద్ద రాసింది. ఇక ఆ మహిళ చైన్‌ను టైగర్‌కి మెడలో గొలుసును ఉంచడంతో అది ఆనందంతో తోక ఊపుతూ కనిపించింది.
కాగా ఆ బంగారపు గొలుసు ధర అక్షరాలా రూ.2.5 లక్షలు. అంత కాస్ట్లీ అయిన గిఫ్ట్‌ని కుక్కకు ప్రజెంట్ చేయడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయి తెగ కామెంట్స్ చేస్తున్నారు.