నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు..నాలుగు గేట్లు ఎత్తివేత

by Naveena |
నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు..నాలుగు గేట్లు ఎత్తివేత
X

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులో 17,000 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి 18,700 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి..17,000 వేల క్యూసెక్కుల వరద నీటిని మంజీరలోకి వదిలిపెడుతున్నామని పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.83 అడుగులు 17.802 టీఎంసీలకు ఉంది. ప్రస్తుతం 17.556టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందని,అలాగే మరో 1,700 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువతో ఆయకట్టు వ్యవసాయ అవసరాల కొరకు వదిలిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో..మాంజీర తీర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed