- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోయిన భారత బౌలర్లు.. 127 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభం అయింది. ఇందులో భాగంగా మొదటి టీ20 గ్వాలియర్ లో ప్రారంభం కాగా.. టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కాగా ఈ మ్యాచులో యువ బౌలర్లు అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్, సుందర్. హర్దిక్ పాండ్యాలు రెచ్చిపోయారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 3, వికెట్లు తీసుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు కుప్పకూలిపోయారు. బంగ్లా బ్యాటర్లలో షాన్టో 27, హసన్ మీరజ్ 35 మినహా ఎవరూ రాణించలేదు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 19.5 ఓవర్లకు 127 పరుగుల మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీసుకోగా.. హర్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 127 పరుగులు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే పూర్తిగా యువ బ్యాటర్లతో ఉన్న భారత జట్టు నుంచి ఎవరు ఓపెనింగ్ చేస్తారనే చర్చ నడుస్తోంది.