- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నకిలీ వైద్యుల గుట్టు రట్టు…ముగ్గురిపై కేసు నమోదు
దిశ,గీసుగొండ: ఆర్.ఎం.పి, పిఎంపీల ముసుగులో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల గుట్టును తెలంగాణ వైద్య మండలి అధికారులు రట్టు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి సెంటర్లపై తనిఖీ చేసి నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. మండలంలోని ఎలుకుర్తి, హవేలీ గ్రామంలో నకిలీ వైద్యుడు కైలాసం మోకాళ్ళ నొప్పులకు స్టెరాయిడ్, ఇంజెక్షన్లు వేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడని, వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ వైద్యా మండలి చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు... హెచ్ఆర్డి ఏ డాక్టర్ నరేష్ కుమార్,డాక్టర్ వెంకటస్వామి నేతృత్వంలోని వైద్య బృందం తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణ వైద్య మండలి అధికారులు తనిఖీ వస్తున్న విషయం తెలుసుకొని నకిలీ వైద్యుడు కైలాసం పరారైనట్లు అధికారులు తెలిపారు. మచ్చాపురంలోని వెంకటేశ్వర మెడికల్ స్టోర్ లో నకిలీ వైద్యం చేస్తున్న మధుకర్.. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండా,చట్ట విరుద్ధంగా బెడ్స్ ఏర్పాటు చేసి యాంటి బయాటిక్, స్టెరాయిడ్, ఇంజక్షన్లు ఇస్తున్నట్టు తగు ఆధారాలు సేకరించారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావి ప్రాంతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు గురుస్వామి విశాలాక్షి మెడికల్ స్టోర్స్ లో నకిలీ వైద్యుడు శ్రీరామోజు శ్రీనివాసులు కూడా చట్ట విరుద్ధ చర్యలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.
గిర్నిబావిలోని మరో వైద్యుడు ఎ.రాజు సెంటర్ కు తాళం వేసి పరారైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురు నకిలీ వైద్యులపైన ఎన్ఎంసి చట్టం 34,54 ప్రకారం గీసుకొండ,దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య మండలి అధికారి డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ… ఆర్ఎంపి, పిఎంపీలు డాక్టర్లు కాదని, వారు ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించాలని తెలిపారు. అలా కాకుండా ప్రిస్క్రిప్షన్ రాయడం, డాక్టర్ అని బోర్డు పెట్టడం, యాంటీబయాటిక్ స్టెరాయిడ్,ఇంజక్షన్లు,సెలైన్లు పెట్టడం,బెడ్స్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని,పరిధి దాటి వైద్యం చేసి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడినచో చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.
ప్రజలు కూడా నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి అవసరం లేని ఇంజక్షన్స్ వేసుకొని జబ్బులు తెచ్చుకోవద్దని, ఎలాంటి శాస్త్రీయత లేకుండా యాంటీబయాటిక్, స్టెరాయిడ్,ఇంజక్షన్లు వేసుకుంటే దీర్ఘకాలిక జబ్బులు అయినా షుగర్, బీపీ, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి సమస్యలు కొని తెచ్చుకోవద్దని తెలిపారు.హెచ్ఆర్డిఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కె. వెంకటస్వామి మాట్లాడుతూ… మెడికల్ స్టోర్ నిర్వాహకులు సైతం క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అమ్మరాదని, నకిలీ వైద్యులు సూచించే మందులు అస్సలు అమ్మ రాదని,లేనిచో డ్రగ్ కంట్రోల్ అథారిటీ తీసుకునే చర్యలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు.