Viral Video: అలా ఎలా సాధ్యమైంది..? ప్రియుడ్ని ట్రంకు పెట్టేలో దాచిపెట్టిన యువతి

by Ramesh Goud |
Viral Video: అలా ఎలా సాధ్యమైంది..? ప్రియుడ్ని ట్రంకు పెట్టేలో దాచిపెట్టిన యువతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లికి భయపడి ఓ యువతి ప్రియుడ్ని ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసిన ఘటన బీహార్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం ఇంట్లో బట్టలు, సామాన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని గమణించిన కుటుంబసభ్యులు అప్పటివరకు ఇంట్లో ఉన్న యువతిని నిలదీశారు. తాను ఏమి లేదని కంగారు పడుతూ సమాధానం ఇవ్వడంతో అనుమానం వచ్చిన తల్లి, సోదరుడు పెట్టెను తెరవాలని చెప్పారు. అందులో ఏమి లేదు తాను తెరవనని సమాధానం ఇవ్వగా పెట్టెను తెరవమని చెబుతూ ఆ యువతి సోదరుడు వీడియో చిత్రీకరించడం మొదలు పెట్టాడు. కుటుంబసభ్యుల బలవంతంతో పెట్టె తాళం తెరవగా అందులోనుంచి ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ యువతి, సోదరుడు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అలా ఎలా సాధ్యమయ్యిందని, అంతచిన్న పెట్టేలో ఆ యువకుడిని ఎలా పట్టించిందని కొందరు అంటుండగా.. మరికాసేపు పెట్టేలోనే ఉంచితే ఆ యువకుడు ఊపిరి ఆడక చనిపోయి ఉండేవాడని, దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed