ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-10-18 14:12:53.0  )
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: శ్రావణి రెడ్డి, అంజన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లవ్ రెడ్డి’(Love Reddy). ఈ సినిమాను స్మరన్ రెడ్డి తెరకెక్కించారు. అయితే దీనిని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరీ స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. లవ్ రెడ్డి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విషయంలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రశంసలు అందుకుంటున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. లవ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా కిరణ్ అబ్బవరం హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా ఆయన మూవీ టీమ్‌కు ఓ మాట ఇచ్చారు. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆయన నాలుగు షోలను ప్రేక్షకుల కోసం ఉచితంగా ఏర్పాటు చేశారు.

నైజాం లో జీపీఆర్‌ ముల్టీప్లెక్స్ లో ఈ రోజు సాయంత్రం 7.45 షో, వైజాగ్ – శ్రీ రామా థియేటర్ 6: 30 షో, తిరుపతి – కృష్ణ తేజ 6: 30 షో, విజయవాడ 6:30 షో వేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా. ప్రజెంట్ ఈ యంగ్ హీరో ‘క’ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

Next Story