ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

by Sridhar Babu |
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
X

దిశ, వీర్నపల్లి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండా, వన్ పల్లి గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తో కలిసి ప్రారంభించారు. వరి కొనుగోలు, లోడింగ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకొని, ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని టోకెన్ పద్ధతి ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తున్నారు, ఎంత విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఏ పీడీ శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ లకావత్ రాములు, వైస్ చైర్మన్ లక్ష్మణ్ ,నాయకులు బొంగు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed