- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: బెంగళూరులో ఘోర ప్రమాదం.. ట్రాఫిక్ పైకి దూసుకెళ్లిన వోల్వో బస్సు
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ లో నిలిచిన వాహానాలపైకి వోల్వో సిటీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి సంబందించిన దృష్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. బెంగళూరు నగరంలో ఎల్లప్పుడు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ట్రాఫిక్ లో వాహానాలు నడపడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఒక్కోసారి వాహానాలు అదుపుతప్పి రోడ్డు పక్కకి వెళతాయి. కానీ ఈ వీడియోలో ఓ బస్సు అదుపు తప్పి ఏకంగా ట్రాఫిక్ లో ఉన్న వాహానాల మీదకే దూసుకెళ్లింది.
బెంగళూరులో జరిగిన ఘటన ప్రకారం సీటీ ఓల్వో బస్సు ట్రాఫిక్ లో ఉండగా.. ఒక్కసారిగా ముందున్న ద్విచక్ర వాహానాలు కార్ల పైకి వెళ్లింది. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించిన ఆగకుండా వాహానాలను ఢీ కొంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు బైకర్స్ కు గాయాలు కాగా.. రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబందించిన దృష్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం బస్సు బ్రేకులు ఫెయిల్ ఉండటమో లేక డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ వెయ్యకపోవడమో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అందుకే వాహనానికి వాహనానికి మధ్య గ్యాప్ మెయింటెన్ చేయాలి అంటారు అని కామెంట్లు పెడుతున్నారు.