Viral Video: గణేష్‌ చందా ఇచ్చిన డాక్టర్‌. ఎంపీ.మంజునాథ్‌.. అతను ఇచ్చిన మనీ చూసి నోరెళ్లబెట్టిన యువకులు..

by Kavitha |
Viral Video: గణేష్‌ చందా ఇచ్చిన డాక్టర్‌. ఎంపీ.మంజునాథ్‌.. అతను ఇచ్చిన మనీ చూసి నోరెళ్లబెట్టిన యువకులు..
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 7న దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఉత్సవ మండళ్లు అన్ని ఏర్పాట్లు చేసేశారు. అయితే, వినాయక చవితి వచ్చిందంటే చాలు.. నవరాత్రులకు ముందుగా పిల్లలు ఇల్లిళ్లు తిరుగుతూ.. పందిరి,ఉత్సవాల కోసం చందాలు వసూలు చేస్తుంటారు. ఇళ్లు, ఆఫీసులు మాత్రమే కాదు.. వచ్చిపోయే వాహనదారులను కూడా అడిగి ఆ వచ్చిన డబ్బుతో వినాయకుడిని పెడుతుంటారు. అదేవిధంగా ఇక్కడ కొందరు చిన్నారులు వినాయకుడి ఏర్పాటు కోసం ఎంపీ డా. మంజునాథ్‌ను డబ్బులు అడిగారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఎంపీ. డాక్టర్ మంజునాథ్‌ను కొందరు యువకులు వినాయకుని చందా ఇవ్వమని అడుగుతున్నారు. అలా గణేష్ చందా కోసం వచ్చిన ఆ పిల్లలకు సదరు ఎంపీ తన పర్స్‌లోనుంచి రూ. 500 నోటు తీసి ఇచ్చాడు. అంతే కాకుండా బాగా చదువుకోవాలని కూడా చెప్పాడు. ఇక అతను రూ. 500 ఇచ్చేసరికి కృతజ్ఞతా భావంతో అక్కడున్న పిల్లలు అందరూ అతను చెప్పినట్టే చేస్తామని చేతులు జోడించి నమస్కరిస్తారు. అలా అక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to hemanth virat facebook account)

Advertisement

Next Story