Viral: ఎంగేజ్ మెంట్ లో కొత్త ట్రెండ్.. ఉంగరాలతో పాటు హెల్మెట్లూ ఎక్సేంజ్

by Ramesh Goud |
Viral: ఎంగేజ్ మెంట్ లో కొత్త ట్రెండ్.. ఉంగరాలతో పాటు హెల్మెట్లూ ఎక్సేంజ్
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలపై(Road Accident) అవగాహన కల్పించేందుకు ఓ జంట వినూత్నంగా ఆలోచించారు. తమ నిశ్చితార్థంలో(Engagement) ఉంగరాలతో(Rings) పాటు హెల్మెట్(Helmets) లను మార్చుకునే కొత్త ట్రెండ్(News Trend) ను తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. చత్తీస్‌ఘడ్(Chhattisgarh), డోంగర్ ఘర్(Dongargarh) ప్రాంతంలోని జర్వాహి(Jarwahi) గ్రామ నివాసి బీరేంద్ర సాహు(Birendra Sahu), జ్యోతి సాహు(Jyoti Sahu)తో నిశ్చితార్థం చేసుకున్నారు.

అయితే ఈ ఎంగేజ్ మెంట్ లో ప్రమాదాలపై అవగాహన కల్పించేలా కొత్త ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. నిశ్చితార్థ సమయంలో సాంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోవడంతో పాటు నూతన వధూవరులు ఇద్దరు హెల్మెట్లు కూడా మార్చుకున్నారు. దీనిపై వరుడు బీరేంద్ర సాహు.. తన తండ్రి బైక్ ప్రమాదంలో మరణించాడని, హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయం అయ్యి మృతి చెందాడని, అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని తెలిపాడు. దీంతో బీరేంద్ర సాహు సృష్టించిన కొత్త సాంప్రదాయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed