viral: 9 నెలల గర్భిణికి పురిటి నొప్పులు.. ప్రసవం కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అవాక్కైన వైద్యులు

by Kavitha |
viral: 9 నెలల గర్భిణికి పురిటి నొప్పులు.. ప్రసవం కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అవాక్కైన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాతృత్వం అనేది పెళ్లైన ప్రతి ఒక్క అమ్మాయి కల. అమ్మ అని పిలుపు కోసం ప్రసవ వేదననను కూడా భరిస్తుంది. అయితే బేసిక్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌ని మనం ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఎందుకుంటే పొట్ట ఎత్తుగా ఉండి చూడగానే తెలిసిపోతుంది ఆమె గర్భవతి అని. సాధారణంగా 4 మంత్స్ నుంచి స్టమక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా 9 నెలలు వచ్చేసరికి చాలా పెద్దగా అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ లేకుండా 9 నెలల పాటు గర్భవతి అని మేనేజ్ చేయడం సాధ్యమా అంటే.. ఇది కేవలం సినిమా, సీరీయల్స్‌లో మాత్రమే సాధ్యం అంటాము. కానీ, జనగామా జిల్లాలోని ఓ మహిళ నిజజీవితంలోనూ దీన్ని నిజం చేసింది. ఆమె ప్రెగ్నెంట్ కాకుండానే 9 నెలల పాటు గర్భిణీగా ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ.. కాన్పు కోసం హాస్పిటల్‌కు వచ్చింది. నానా హంగామా చేసి చివరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

జనగామా మాతా శిశు హాస్పిటల్‌లో ఓ మహిళా హై డ్రామా ఆడింది. పురిటి నొప్పులు వస్తున్నాయని, ఆసుపత్రికి వచ్చిన మహిళ.. డెలివరీ చేయాలంటూ వైద్య సిబ్బందిని కోరింది. ఇక వైద్యులు కూడా ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. తీరా ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లోస్తానంటూ వెళ్లిన మహిళ ఆ తర్వాత వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీ మూలంగా అబార్షన్ అయిందంటూ ఆస్పత్రి సిబ్బందిపై నింద వేసింది. ఇక మహిళ తీరుపై అనుమానం వచ్చిన వైద్యులు మహిళ వెళ్లిన వాష్ రూమ్‌కు వెళ్లి పరిశీలించగా అక్కడ మూడు చీరలు బాత్రూమ్‌లో దొరకాయి. దీంతో ఆమెను గట్టిగా నిలదీసి వైద్య పరీక్షలు చేసి అసలు ఆవిడ గర్భవతి కాదని తేల్చి చెప్పారు. అసలు ఇదేంటని ప్రశ్నిస్తే.. తిరిగి వైద్య సిబ్బందిపై గొడవకు దిగడంతో, పోలీసులకు సమాచారమిచ్చారు ఆసుపత్రి సిబ్బంది. ఇక ఆసుపత్రి వర్గాల నుంచి ఫిర్యాదు అందడంతో సదరు మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు కావట్లేదని సంవత్సర కాలంగా అత్తింటి వారు తిడుతున్నారని, అందుకే గర్భవతి అని డ్రామా ఆడాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed