Car Accident: మహారాష్ట్రలో కారు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే అల్లుడు..!

by Maddikunta Saikiran |
Car Accident: మహారాష్ట్రలో కారు ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే అల్లుడు..!
X

దిశ, వెబ్‌డెస్క్:మహారాష్ట్ర(Maharashtra)లో కారు ప్రమాదాని(Car Accident)కి గురై ఎమ్మెల్యే(MLA) అల్లుడు(Son-In-Law) గాయపడిన ఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అనుశక్తి నగర్(Anushakti Nagar) నియాజకవరం,నేషనల్ కాంగ్రెస్ పార్టీ(NCP)కి చెందిన ఎమ్మెల్యే నవాబ్ మాలిక్(Nawab Malik) కారు ముంబై(Mumbai)లోని కుర్లా(Kurla) ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే అల్లుడు సమీర్ ఖాన్(Sameer Khan) గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.నవాబ్ మాలిక్ కుమార్తె,అల్లుడు ఇద్దరూ కలిసి కుర్లాలోని ఓ ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేసుకొని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు.ఎమ్మెల్యే అల్లుడు కారులోకి ఎక్కే క్రమంలో కారు డ్రైవర్ ప్రమాదవశాత్తూ యాక్సిలరేటర్‌ను నొక్కాడు. దీంతో కారు వెళ్లి గోడను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సమీర్ ఖాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయని,సమీర్ ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నాడని ముంబై పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంభందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed