Soldiers: మంచులో చిక్కుకున్న సైనికులు.. 3 రోజుల తర్వాత రక్షించిన రెస్య్కూ టీమ్

by vinod kumar |
Soldiers: మంచులో చిక్కుకున్న సైనికులు.. 3 రోజుల తర్వాత రక్షించిన రెస్య్కూ టీమ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-చైనా సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు మంచులో చిక్కుకున్నారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన అధికారులు మూడు రోజుల తర్వాత వారిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని బక్సర్‌కు చెందిన అనిల్ రామ్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బృందంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మరొక సైనికుడు దేవేంద్ర సింగ్‌తో కలిపి పహారా నిర్వహిస్తుండగా మంచులో చిక్కుకు పోయారు. మున్సియారీకి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలో ఉన్నారు. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆపరేషన్‌ ప్రారంభించింది. 36 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి ఎట్టకేలకు అనిల్‌, దేవేంద్రలను గుహ నుంచి రక్షించారు. అనంతరం ఇద్దరినీ ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శ్రేష్ట్ గున్సోలా మాట్లాడుతూ అనిల్, దేవేంద్ర ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని తెలిపారు. నాలుగు అడుగుల మంచులో నావిగేట్ చేసి వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed