‘కొంత మంది అమ్మాయిలు ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ను దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు’.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-09-19 14:44:02.0  )
‘కొంత మంది అమ్మాయిలు ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ను దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు’.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Johnny Master) కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ.. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. అయితే ఇదే టైం లో బిగ్ బాస్(Bigg Boss) ఫేమ్ ఆట సందీప్(Aata Sandeep) సతీమణి, ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్(Jyothi Raj) జానీ మాస్టర్ కేసుపై ఇన్ డైరెక్ట్‌గా సంచలన కామెంట్స్ చేస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ..

‘ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ స్మార్ట్ అవుతున్నారు. చాలామంది అమ్మాయిల గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలి. అది ఎంత పెద్ద వారైనా సరే.. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంత పెద్ద వాళ్ళు అయినా వారిని వదలకూడదు. కానీ కొన్ని చట్టాలని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. లైఫ్‌లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మనం రెండు వైపులా విని మాట్లాడాలి. కానీ ఫేమస్ వ్యక్తి కదా అని తన పొజిషన్‌ని మన వ్యూస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వాడొద్దు. తప్పు చేస్తే కచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కచ్చితంగా నిజం బయటకు వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ‘ప్లీజ్ వాళ్లకి ఒక ఫ్యామిలీ ఉంటది. భార్య చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు న్యూట్రల్‌గా స్పందిస్తున్నారు. కాగా పరారిలో ఉన్న జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ(Cyberabad SOT) పోలీసులు గురువారం బెంగళూరు(Bangalore)లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Read More..

Johnny Master: జానీ మాస్టర్ అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు


(video credits to Jyothi raj instagram id)


Next Story