- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైన్ మ్యాన్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది.. పోలీసులకే షాక్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః కరెంట్ పోయిందంటే అంతా గందరగోళమవుతుంది. చాలా ఆఫీసుల్లో పనంతా ఆగిపోతుంది. అందుకే విద్యుత్‌కి అంత పవర్. మరి దాన్ని సప్లై చేసే లైన్ మ్యాన్‌కి కూడా అంతే పవర్ ఉంటుందని నిరూపించాడు ఓ లైన్ మ్యాన్. హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ పట్టుబడిన మహ్మద్ మెహతాబ్‌కు పోలీసులు రూ. 6,000 జరిమానా విధించడంతో ఉత్తరప్రదేశ్‌లోని థానా భవన్ పోలీస్ స్టేషన్‌కు ఈ లైన్‌మ్యాన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో హెల్మెట్ లేకపోతే అధికారిక జరిమానా రూ. 2,000. కానీ, ఈ లైన్‌మెన్‌ను మూడు రెట్లు ఎందుకు చెల్లించాడో స్పష్టత లేదు. ఈ సంఘటన ఆగస్ట్ 23, మంగళవారం నాడు జరిగింది.
"నా నెలవారీ జీతం రూ. 5,000 కాగా, నాపై విధించిన జరిమానా రూ. 6,000. నన్ను క్షమించమని పోలీసులను అభ్యర్థించాను. భవిష్యత్తులో నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పాను, కానీ వారు కనికరం చూపలేదు, "అని మెహతాబ్ విలేకరులతో అన్నారు. ఆ తర్వాత, కోపోద్రిక్తుడైన మెహతాబ్ ఠాణా భవన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఈ డిస్‌కనెక్ట్ సమస్యపై కామెంట్ చేయడానికి అతను నిరాకరించాడు. ఇదిలా ఉండగా విద్యుత్ లైన్ తెగిపోవడానికి విద్యుత్ శాఖ అధికారులు వేర్వేరు కారణాలను చెబుతున్నారు.
విద్యుత్ అధికారుల ప్రకారం, 55 వేలకు పైగా పోలీస్‌స్టేషన్ బకాయిలు చెల్లించాల్సి ఉందని, అందుకే విద్యుత్ కనెక్షన్ కట్ అయిందని విద్యుత్ శాఖ జూనియర్ ఇంజినీర్ అమితేశ్ మౌర్య పేర్కొన్నారు. కాగా, సబ్ డివిజనల్ అధికారి పుష్ప్ దేవ్ మాట్లాడుతూ, "ఇది (విద్యుత్ డిస్‌కనెక్షన్) ప్రతీకారంతో కాదు, లైన్‌లో కొంత లోపం ఏర్పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొంత సమయం తర్వాత విద్యుత్ సరఫరా పునఃప్రారంభమైంది" అన్నారు. ఏదేమైనా ఈ వీడియో క్రేజీగా వైరల్ అయ్యింది.
మనుషుల్లా డాల్ఫిన్స్ కూడా పేర్లు పెట్టుకుంటాయి.. అవి ఇలా..?!