- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. సీన్ రీ-క్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు.. వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా.. అదే సమయంలో అతనిపై బుల్లెట్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయం అయింది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిని కాల్చి చంపిన విషయం విదితమే. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనను ఉగాండాకు చెందిన చిన్నారులు సీన్ రీ-క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో లో ఉన్న ప్రకారం.. ట్రంప్ పాత్ర పోషిస్తున్న బాలుడు, చెక్క తుపాలకులా చేసిన గన్స్‌తో సీక్రేట్ సర్వీస్ సెక్యూరిటీ, కాల్పులు జరుపుతున్న సమయంలో ఉన్న వాయిస్, విజువల్స్ పిల్లలు డిట్టో దించేశారు.
దుండగుడు కాల్పులు జరుపుతున్న సమయంలో ట్రంప్, సెక్యూరిటీ సిబ్బంది, ప్రజలు ఏ విధంగా అయితే ప్రవర్తించారో అదే విషయాన్ని పిల్లలు తమ వీడియోలో చూపించారు. కాల్పుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అయితే పిడికిలి బిగించి పోరాడుతాం అని డైలాగ్ చెప్పాడో.. ట్రంప్ పాత్ర పోషించిన బాలుడు కూడా బిగ్గరగా అరిచి.. పిడికిలి బిగించడం వీడియోలో హైలెట్‌గా మారింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన అంశాలపై ఇలా చేయడం మంచిది కాదని కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.