- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tuition Teacher: ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదారి పడుతోంది. చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు ప్రేమ పేరుతో అరచకాలు చేస్తున్నారు. పెద్ద, చిన్నా తేడా లేకుండా వ్యవహరిస్తూ.. సభ్యసమాజం తలదించుకునే పనులకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడిన మైనర్ గురు, శిష్యుల బంధాన్ని అపహాస్యం చేసిన ఘటన చెన్నై నగరంలోని పెరియామెట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇరవై రెండేళ్ల ఓ టీచర్ ఓ మైనరు (17)కు ట్యూషన్ చెప్పేది. అయితే, వారిద్దరి మధ్య ఉన్నది గురు, శిష్యల బంధమే అయినా కొన్నాళ్లకు ఆ బంధం కాస్త ప్రేమకు దారి తీసింది.
అలా కొన్నాళ్లు గడిచాక ఉన్నట్టుండి ఆ టీచర్ బాలుడి దూరం పెట్టింది. అయితే, ఆ వేదనను తట్టుకోలేని ఆ బాలుడు టీచర్‌ను ఎలాగైనా లొంగదీసుకోవాలని యత్నించాడు. టీచర్ ఇంటి చిరునామాకు ఆమె తెలియకుండా తీసుకుని వాళ్లింటికి వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆర్డర్లు పెట్టడం స్టార్ చేశాడు. ఏకంగా 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ బుక్ చేసి నిత్యం వేధించాడు. దీంతో ఆ టీచర్ కుటుంబం వచ్చే ఆన్‌లైన్ ఆర్డర్లతో ఈ పని ఎవరు చేస్తున్నారో తెలియక మానసిక వేదనకు గురైంది. ఇక చేసేదేమి లేక బాధిత కుటుంబ సభ్యులు సమీప పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన ఐపీ నెంబర్ ఆధారంగా వారు దర్యాప్తు చేసి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లు, ఓ వైఫై రూటర్‌ను సీజ్ చేశారు.