Trending: వామ్మో.. ఎంతపని చేశార్రా..! దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన జనం

by Shiva |
Trending: వామ్మో.. ఎంతపని చేశార్రా..! దొంగ బాబాలకు దేహశుద్ధి చేసిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: సైన్స్, టెక్నాలజీలో దేశం దూసుకెళ్తున్నా గ్రామాల్లో మాత్రం పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. నేటికీ మూఢ నమ్మకాలనే ఉచ్చులో పడిపోతూ నిలువునా మోసపోతున్నారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలో ఘరనా మోసం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం సస్కల్ గ్రామంలో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు సాధువుల రూపంలో ఉన్న దొంగ బాబాలు భోజనం చేయడానికి వచ్చారు. అనంతరం సుష్టిగా భోజనం చేశాకా.. యజమానితో మాటామాట కలిపారు. నీవు సమస్యల్లో ఉన్నావని మంచి జరగాలంటే చేతికి బంగారు ఉంగరాన్ని రాగి చెంబులో వేయని చెప్పగా.. యజమాని వాళ్ల మాటలు నమ్మి అందులో వేశాడు. ఆ తరువాత పథకం ప్రకారం యజమానిని ఇంట్లోకి పంపించి.. అతడు బయటకు వచ్చేసరికి రాగి చెంబుకు తెల్లబట్టను చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవొద్దని తెలపడంతో అనుమానం వచ్చిన యజమాని చెంబు తెరచి చూడగా.. అందులో ఓ రాయి దర్శనమిచ్చింది. దీంతో తాను మోసపోయానని పసిగట్టిన యజమాని గట్టిగా అరవడంతో చుట్టుప్రక్కల వారు అప్రమత్తమై దొంగ బాబాలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed