Trending: వారెవ్వా ఏం ఐడియా.. ఆర్టీసీ బస్సులో కూరగాయల విక్రయం, నెట్టింట్లో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-07-14 05:33:08.0  )
Trending: వారెవ్వా ఏం ఐడియా.. ఆర్టీసీ బస్సులో కూరగాయల విక్రయం, నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. దీంతో బస్సులు అన్ని కిక్కిరిసి ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో వినూత్న ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి పరిగికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళ రైతు మార్కెట్‌కు బెండకాయలను అమ్మేందుకు తీసుకెళ్తోంది. అయితే, బస్సులో ఉన్న ప్రయాణికులు ఆ తాజా బెండకాయలను చూసి అమ్ముతావా అని మహిళా రైతును ప్రశ్నించారు. దీంతో ఆమె తన వద్ద ఉన్న తరాజును బయటకు తీసి బస్సులోనే బెండకాయలు విక్రయించింది. అయితే, ఆ దృశ్యాలను బస్సులో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/ChotaNewsTelugu/status/1812349585907470400

Advertisement

Next Story