Trending: ఓ అగ్గిపుల్ల ఎఫెక్ట్.. కొంచెం అయితే అందరూ బూడిదే (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-08-21 07:47:58.0  )
Trending: ఓ అగ్గిపుల్ల ఎఫెక్ట్.. కొంచెం అయితే అందరూ బూడిదే (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్గిపుల్లతో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ను ఓ వ్యక్తి తన బైక్‌పై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఓ షాపులో పని ఉందని చెప్పి ఆగగా.. ఆ పెట్రోల్ క్యాన్ బోల్తా పడింది. డబ్బాలోని పెట్రోల్ అంతా రోడ్డుపై కాలువలా ప్రవహించింది. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కింద పడిన పెట్రోల్‌ను గమనించకుండా ఓ వ్యక్తి బీడీ వెలిగించి అగ్గిపుల్ల కింద పడేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే పార్క్ చేసిన ఓ బైక్‌, షాపు మంటల్లో కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన ద్విచక్ర వాహనదారులు మంటలపై నీళ్లు చల్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/ChotaNewsTelugu/status/1826144141941563859

Advertisement

Next Story

Most Viewed