- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. రైల్వే ట్రాక్‌పై తేలియాడుతున్న భారీ చేపలు
దిశ, వెబ్‌డెస్క్: ముంబై మహా నగరంపై వరుణ దేవుడు విరుచుకుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇళ్లలోనే ఉంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసిన వరద నీరు దర్శనమిస్తోంది. రుతు పవనాలు మరింత బలపడటంతో మరో రెండు రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ముంబై నగరంతో పాటు థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి ఏరియాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై భారీ ఎత్తున నీరు చేరింది. అయితే, ఆ నీటిపై భారీ చేపలు తేలియాడుతూ కనిపించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1810851632692822171