- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trending: ప్రతి ఐదేళ్లకు ఊరుఊరంతా మాయం.. అసలు వాళ్లంతా ఎక్కడికి వెళ్తారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: భిన్న జాతులు, విభిన్న సంస్కృతుల సముదాయం మన భారతదేశం. ప్రతి గ్రామానికి ఓ చారిత్రక నేపథ్యం, ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి. అయితే, చిత్తూరు జిల్లాలోని గుడిపల్లి మండలంలోని గుడికొత్తురు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఊరుఊరంతా మాయం అవ్వడం అక్కడి ఆచారం. వివరాల్లోకి వెళితే.. ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం.. ఐదేళ్లకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వన భోజనాలకు వెళ్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి పశువులతో సహా ఊరు బయటకు వెళ్లిపోతారు. గ్రామానికి భవిష్యతులో ఎలాంటి కీడు జరగకూడదని అలా వారు వన భోజనానికి వెళ్తుంటారు. తిరిగి సూర్యుడు అస్తమించిన వెంటనే ముందు పశువులను గ్రామంలోకి వదులుతారు. అనంతరం గ్రామ దేవతలు గ్రామంలోకి ప్రవేశించార గ్రామస్తులు వారివారి ఇళ్లల్లోకి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.